- మంజీర తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరిందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని వినాయక నగర్ లో కాలనీలో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ & ఎస్ బి ఆధ్వర్యంలో రూ.11 లక్షల అంచనా వ్యయంతో చేపట్టబోయే మంజీర తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా , జలమండలి అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరిందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపడుతున్నామని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని, అంతేకాక పవర్ బోర్లు ద్వారా కూడా తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 18 రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టామని, ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డిజిఎం శరత్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజు నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, జంగయ్య యాదవ్, నరేష్, వినోద్, మల్లేష్, ఎండి ఇబ్రహీం, దాసరి గోపి, సతీష్, ఆకుల యాదగిరి, శ్రీకాంత్, వసంత కుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, అంజమ్మ, జగదీశ్, రమేష్ గౌడ్, గోవింద్, అక్బర్ బాయ్, నారాయణ, శ్యామ్లెట్ శ్రీనివాస్, ఖాదర్ ఖాన్, పామెటి రమేష్, హాసన్, నర్సింహా రాజు, రమేష్ గౌడ్, మాధవి, కాలనీ వాసులు పాల్గొన్నారు.