నమస్తే శేరిలింగంపల్లి : యాదవ రాజ్యాధికార సాధనాసమితి 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ దేశం మొత్తం బహుజన రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నా జాతి బిడ్డలను బహుజన రాజ్యాధికారంలో ముందు వరుసలో ఉంచాలనే ఉద్దేశ్యంతో బడుగుల నాగార్జున యాదవ్ యాదవ రాజ్యాధికార సాధన సమితి స్థాపించారన్నారు. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు మరియు అణగారిన వర్గాలకు దామాషా పద్ధతిలో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ప్రధాన పార్టీలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమలో కలసాని వెంకటేశ్వర్లు యాదవ్, రాము యాదవ్, నాగులు యాదవ్, టి కుమార్ ముదిరాజ్, రాజేష్, శంకర్, సురేష్, కుమార్ నాయక్, దయాకర్, సాయికుమార్, సంజీవ, కృష్ణ పాల్గొన్నారు.