నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో అన్నమ స్వరార్చన, నృత్యార్చన వేడుకగా జరిగింది.
ఇందులోభాగంగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామికి తొలుత శోభా రాజు విద్యార్థులు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. అనంతరం శ్రీ భాస్కర డాన్స్ అకాడమీ గురువు సాత్విక వారి శిష్య బృందం తమ నృత్య ప్రదర్శనతో అందరిని అలరించారు. ఇందులో భాగంగా, “గణపతి కౌతం, ప్రణమ్య శిరసా దేవం, పుష్పాంజలి, కృష్ణం కలయ సఖి, రామాయణ శబ్దం, హనుమాన్ చాలీసా, బ్రహ్మ మురారి, చిన్ని శిశువు, సంధ్యా సమయము” అనే సంకీర్తనలను ప్రదర్శించారు. తదనంతరం కళాకారులను సంస్థ అధ్యక్షులు డా. శోభా రాజు, శాలువా జ్ఞాపికతో సత్కరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామికి అంగనలీరే మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.