నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ కార్యాలయంలో తెలంగాణ అంబేద్కర్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని నూతన తెలంగాణ అంబేద్కర్ సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పోతురాజు లాలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లెల జయ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు గణపురం రవీందర్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ దీప, బస్వరాజ్, గోపాల్ యాదవ్, మహేష్, విద్యావతిదేవి, హుడాట్రేడ్ సెంటర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ కుమార్, బుచ్చిరెడ్డి, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.