గౌడ హాస్టల్ గది నిర్మాణానికి ఎన్ఏంజి సేవ ట్రస్ట్ రూ.4 లక్షల విరాళం

  • రూ. 4 లక్షల చెక్కును పల్లె లక్ష్మణ్ గౌడ్ కు అందజేసిన ట్రస్ట్ చైర్మన్ ధాత్రినాథ్ గౌడ్

iనమస్తే శేరిలింగంపల్లి: గౌడ్ ల అభ్యున్నతి, అభివృద్ధికి దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. గౌడ్ లు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదిగేలా ప్రోత్సాహం అందించడంతో పాటు తమ వంతు సహాయ, సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉప్పల్ భగాయత్,  నాగోల్ లోని కొత్త గౌడ్ హాస్టల్ లో గది నిర్మాణం కోసం ఎన్ఎంజి సేవా ట్రస్ట్ ఆర్థికంగా సహకారం అందించింది. ట్రస్ట్ చైర్మన్ ఎన్. దాత్రినాత్ రూ. 4 లక్షల విరాళం ను చెక్కు రూపేణా గౌడ్ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, పి.అశోక్ గౌడ్, చింతకింది గోవర్ధన్ గౌడ్, కరుణాకర్ గౌడ్, పుట్ట వినయ్ కుమార్ గౌడ్, వీర్ కుమార్ గౌడ్, చింతకింది రవీందర్ గౌడ్, నరసింహ గౌడ్, నంద్ గౌడ్ పాల్గొన్నారు.

రూ. 4 లక్షల చెక్కును పల్లె లక్ష్మణ్ గౌడ్ కు ఇస్తున్న ట్రస్ట్ చైర్మన్ ధాత్రినాథ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here