- 18 ద్వి చక్ర వాహనాలు స్వాధీనం
నమస్తే శేరిలింగంపల్లి : రాంగ్ రూట్లో వస్తూ వాహనాలు నడిపిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యు-టర్న్, కోకోకోలా ఎక్స్ రోడ్డు వద్ద మియాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, అనిల్, ఎస్‌ఐ పి. మల్లేష్, ఎస్‌ఐ పి సుభాష్, పిఎస్ సిబ్బందితో ఈ డ్రైవ్ నిర్వహించారు.
మొత్తం 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్, బాచుపల్లి లా & ఆర్డర్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రోడ్డుపై రాంగ్ రూట్లో వాహనాలు నడిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.