నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా కృషి చేస్తారని ఆశీస్తూ.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లీగల్ సెల్ కన్వీనర్‌గా న్యాయవాది కె. సురేందర్ గౌడ్ ని నియమించారు. తనపై నమ్మకంతో తనకు ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు అన్ని దిశల్లో కృషి చేస్తానని, తన ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు.