మెరుగైన సేవలు అందించాలి: సీపీ స్టీఫెన్ రవీంద్ర

  • రినవేటెడ్ వుమెన్ పీఎస్ ను ప్రారంభించిన సీపీ 
  • మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత

నమస్తే శేరిలింగంపల్లి:  సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి లో రినవేటెడ్/పునరుద్ధరించి మహిళా పోలీస్ స్టేషన్ ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్., ప్రారంభించారు. సీపీ ముందుగా మహిళా పోలీసు స్టేషన్ లో నూతనంగా రెనవేట్ చేసిన చేసిన కిడ్స్ ప్లే ఏరియా, రిసెప్షన్ స్టాఫ్, కౌన్సిలింగ్ రూము లను పరిశీలించారు. మహిళా పోలీసుస్టేషన్ పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.

రినవేటెడ్ వుమెన్ పీఎస్ ను ప్రారంభించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్

రిసెప్షన్ సిబ్బంది పిటిషనర్ల పట్ల మర్యాదతో మెలగాలని, మెరుగైన సేవలు అందించాలన్నారు. కౌన్సిలర్ల ఓపికగా ఉంటూ సమస్యలను తెలుసుకొని కౌన్సిలింగ్ కు వచ్చే వారికి సూచనలు ఇవ్వాలని సూచించారు. గృహ హింసకు గల కారణాలు, ఎక్కువగా ఏ కారణాలతో దంపతులు విడిపోతున్నారు, సహ జీవనం, పొక్సో కేసుల నమోదు తదితర విషయాలను సీపీ తెలుసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా నమోదైన కేసుల, కౌన్సిలింగ్ డేటా ను విశ్లేషించి సమస్యలకు గల ముఖ్య కారణాలను విశ్లేషించాలన్నారు. ఇందుకు అవసరమైతే TPCC సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) సహాయం తీసుకోమన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యల పరిష్కారం ప్రాధాన్యతగా విధులుండాలని ఆదేశించారు. పోలీసులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు. ఏయే కారణాలతో ఎక్కువగా కౌన్సిలింగ్ కి వస్తున్నారు, వారికి కౌన్సిలింగ్ ఎలా చేస్తారు వంటి అంశాలను సీపీ సిబ్బందితో చర్చించారు. మహిళా పోలీస్ స్టేషన్ లోని పనిచేస్తున్న సిబ్బంది స్ట్రెంత్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సీపీ వెంట మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, గచ్చి బౌలి ఇన్ స్పెక్టర్ సురేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మహిళా పోలీస్ స్టేషన్ లో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను పరిశీలిస్తున్న సిపి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here