నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహించిన ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళలో కొలువుదీరిన చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
రాజస్థాన్ కోట చీరలు, గుజరాత్ క్యాచ్ శాలువాలు, బంధాని చీరలు, లక్నో చికంకారీ చీరలు, కోల్ కతా పెయింటింగ్ చీరలు, మస్లిన్, తస్సార్, బెంగాల్ కాటన్ చీరలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వుడ్ కార్వింగ్ పెద్ద పెద్ద బోమ్మలు , చెక్క విగ్రహాలు, దర్వాజాలు, దేవత విగ్రహాలు, అస్సాం వెదురు బుట్టలు, బనారస్ పట్టు గౌనులు, పట్టు లంగాలు, పట్టు చీరలు, మెటల్ ఆర్ట్ వర్క్ వాల్ హ్యాంగింగ్స్, టెర్రకోట బొమ్మలు, వంట సామగ్రి, డ్రై ఫ్లవర్స్ మరి ఎన్నో హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు మిశ్ర రాస్, గర్భ, హుడా, తిప్పని నృత్యాలు, డాక్టర్ ప్రియాంక మిశ్ర భువనేశ్వర్ బృందంచే ఓడిస్సి, సంబల్పూరి నృత్యాలు మరి కుమారి అంజు అరవింద్ బృందంచే భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.