డైరెక్టర్ గోపాల్ రెడ్డిని ప్రశంసించిన రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : పివిఆర్ మాల్ ఎర్రమంజిల్ సినిమా హాల్లో దళారి చిత్రం చూసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ దళారి చిత్ర దర్శకుడు కచిడి గోపాల్ రెడ్డిని ప్రశంసల వెల్లువలో ముంచెత్తాడు. విజయవంతమైన దళారి చిత్రంలో తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు దర్శకుడు గోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

దళారి చిత్రం పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, చిత్ర దర్శకుడు డైరెక్టర్ గోపాల్ రెడ్డి తదితరులు

విభిన్నమైన కథాంశంతో దళారి వ్యవస్థ పై రూపొందిన సినిమాలో కథ, స్క్రీన్ ప్లే డైలాగులతో సినిమాను దర్శకుడు నడిపించిన విధానం అమోఘంగా ఉందన్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయన్నారు. ప్రధాన పాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, షకలక శంకర్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. సినిమా చాలా బాగుందన్నారు. అందరూ దళారి సినిమా చూడాలని ఆదరించాలని అన్నారు.

పివిఆర్ మాల్ ఎర్రమంజిల్ సినిమా హాల్లో దళారి చిత్ర బృందంతో భేరి రాం చందర్ యాదవ్

అద్భుతమైన సినిమాలు రూపొందించినందుకు దళారి దర్శకులు కచిడి గోపాల్ రెడ్డి నిర్మాత వెంకట్ రెడ్డి, సంగీత దర్శకులు రాజ్ కుమార్, నటీనటులు టీమ్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here