అనతికాలంలోనే అత్యాధునిక వైద్య సేవలు అభినందనీయం

  • మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ని ప్రారంభించిన తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: అనతికాలంలోనే ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో.. అనుభవజ్ఞులైన వైద్యుల సహాయంతో సేవలు అందిస్తూ ప్రజల మన్నలను పొందటం హర్షించతగ్గ విషయమని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమన్ & చైల్డ్ కోసం ప్రత్యేకంగా.. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయనతోపాటు రామలింగేశ్వర రావు చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ & మానిటరింగ్ కమీషన్, మాజీ న్యాయమూర్తి, తెలంగాణ & AP హైకోర్టు, కమీషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ , అనురాగ్ శర్మ, సజ్జనార్ , కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మెడికవర్ గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా అనిల్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్థాపించిన అతి కొద్దికాలంలోనే 25 హాస్పిటల్స్ కి విస్తరించడం చాలా గర్వించ తగ్గ విషయం అన్నారు.

మారుతున్న జీవనశైలి వల్ల పుట్టబోయే శిశువులు, పుట్టిన శిశువులు, చిన్నపిల్లలు, పెద్దవారు అనేక అనారోగ్య సమస్యలని ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్మించడం చాల సంతోష తగ్గ విషయం అన్నారు. రామలింగేశ్వర రావు మాట్లాడుతూ ఉమన్ & చైల్డ్ కోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడం అభినందనీయమన్నారు. అనంతరం మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ 100 పడకలతో, 25 బెడ్డెడ్ లెవెల్ 4 NICU & PICU యూనిట్స్ , అత్యాధునిక హై ఎండ్ పరికరాలు, ఆపరేషన్ థియేటర్స్ , 24 X 7 అనుభవజ్ఞులైన గైనకాలజి, ఒబెస్ట్ట్రిక్స్, పిడియాట్రిక్స్ & నియోనాటాలజీ వైద్యులు అందుబాటులో ఉండేలా.. శిశువులకి, గర్భిణులకు, పిల్లలకి & స్త్రీలకు వైద్య సేవలను అందిచాలనే లక్ష్యంతో హాస్పిటల్ ని నిర్మించామని తెలిపారు. ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక్కసారి అయినా ఆరోగ్య పరీక్షలు చేపించుకోవడం ఎంతో మేలు అని అన్నారు.


ఏ వ్యాధినైనా మొదటి దశలోనే గుర్తిస్తే దానికి సరైన సమయం లో చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణనష్టం జరగకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యఅతిదులకి ధన్యవాదములు తెలిపారు. పీడియాట్రిక్స్ & నియోనాటాలజీ విభాగం అధిపతి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అత్యాధునిక సౌకర్యాలతో , హై ఎండ్ టెక్నాలజీ తో వైద్యసేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ రెడ్డి డైరెక్టర్ క్లినికల్ సర్వీసెస్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, మహేష్ ధేగ్లూర్కర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె- HOD నియోనాటాలజీ, పీడియాట్రిక్స్, డాక్టర్ లలిత – యురోగైనకాలజిస్ట్, గైనకాలజిస్ట్ & ఒబెస్ట్ట్రిక్స్ డాక్టర్ రాధికా, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ అనూషరెడ్డి, క్లస్టర్ హెడ్ దుర్గేష్, సెంటర్ హెడ్ అనిల్, డిఎం ఎస్ డాక్టర్ సంగీత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here