ఇన్స్టంట్ మెస్సేజింగ్ ఆప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఎంతగా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాటింగ్, వీడియో, ఆడియో కాల్స్ వంటి సదుపాయాలతో ఉత్తమ సర్వీసులు అందిస్తోంది వాట్సాప్. ఇప్పుడు తాజాగా వాట్సాప్ పెమెంట్స్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వాట్సాప్ లో ఆర్థిక కార్యకలాపాలకు నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్ పిసి ఐ) గురువారం అనుమతులు ఇచ్చింది. అయితే దశల వారీగా ఈ సర్వీసులు అందించాలనే కండీషన్ పెట్టడంతో తొలిగా రెండు కోట్ల మంది వినియోగదారులతో మాత్రమే సర్వీసు ప్రారంభం కానుంది. విశేషమేమంటే వాట్సాప్ లావాదేవీలపై ఎటువంటి ఫీజు ఉండబోదని సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే వాట్సాప్ యుపిఐ సర్వీసులను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే సంస్థలు ఆన్లైన్ లావాదేవీల్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. వాట్సాప్ పే రాకతో పై రెండు సంస్థలకు గట్టి పోటీదారు వచ్చినట్లయింది.