పెళ్ళికి ముందు వధువు బ్రేకప్… తనను తానే పెళ్లి చేసుకున్న వరుడు

కొద్దిరోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా పెళ్లి కూతురు బ్రేకప్ చెప్తే ఏమవుతుంది..? సాధారణంగా అయితే పెళ్లి ఆగిపోవడమో, వరుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడమో జరుగుతుంది. కానీ బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి వేడుకను యధాతథంగా జరిపి తనను తానే పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే… బ్రెజిల్ కు చెందిన డియాగో రాబెలోకు విక్టర్ బ్యూనో తో గత సంవత్సరం నవంబర్లో నిశ్చితార్థం జరిగింది. కాగా వేసవిలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత జులై లో విడిపోయారు. అక్టోబర్ 16 వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉండగా బంధువులు స్నేహితులు వివాహం రద్దు అవుతుందని భావించారు.అయితే డియాగో మాత్రం పెళ్లి వేడుకను ఒంటరిగానే జరుపుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here