
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దీప్తిశ్రీ నగర్ శ్రీ ధర్మపురి క్షేత్రంలో శ్రీ నాంపల్లి బాబా ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ నాంపల్లి బాబా సమాది చెంది 16 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శుక్రవారం బాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నాంపల్లి బాబా సమాధిని పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. అదేవిధంగా బాబా వారికి అభిషేకం, హోమం, అన్నసమారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బాబాను దర్శించుకుని, అన్నప్రసాదం స్వీకరించారు.
