ప్రజాక్షేమమే లక్ష్యం : ప్రభుత్వ విప్ గాంధీ

  • బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా .. సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి నుంచి రూ. 2 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి పత్రాన్ని బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.

బాధిత కుటుంభ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సి అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్ కి చెందిన సయ్యద్ అలిముద్దీన్ కి రూ. 1లక్ష, కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ కి చెందిన మెహరున్నిసా కి రూ. 1 లక్ష 50 వేలు మంజూరయ్యాయని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, మోహన్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, ఎం డి ఇబ్రహీం, విమల్ కుమార్, శ్రీహరి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here