నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి విలేజ్ మండల ప్రాథమిక పాఠశాలలో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతన ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు ప్రతీ బస్తీ, కాలనీల్లో ప్రజలకు తెలపాలన్నారు.
ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులలో ఏమైనా సందేహాలుంటే బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏలతో సమన్వయం చేసుకుని నివృత్తి చేసేలా పని చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ఓటు హక్కు నమోదుపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఓటరు జాబితాలో గతంలో ఉన్న ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోవాలని సూచించారు. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండేదని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరణ చేసిన నేపథ్యంలో ఇకనుంచి నాలుగుసార్లు నమోదు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. 18 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, అసిస్ట్ మునిసిపల్ ఆఫీసర్ యాదగిరి రావు, బి.ఎల్.ఏ రాధికా, రాజేందర్, అఫ్రోజ్, పాల్గొన్నారు.