నమస్తే శేరిలింగంపల్లి : ఓటు పదునైన ఆయుధమని, కలముతో సాధించలేని ప్రగతిని ఓటుతో విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తుందని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడారు. చదువుకున్నవాడైన..చదువు రానివాడైనా.. శ్రామికుడైన.. కార్మికుడైన.. వ్యవసాయకుడైన.. ఏ వ్యక్తి అయినా ఓటును సరిగ్గా వినియోగించుకొని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకొంటే సమాజాభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
‘ఓటు మీ భవిష్యత్తు.. ఓటు మీ భద్రత‘, ‘ఓటు మీ అభివృద్ధి.. ఓటు మీ కలలు సాకారం’, ఓటు వేసుకో నీ తలరాత మార్చుకో అని పిలుపునిచ్చారు.