కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయం

  • శేరిలింగంపల్లి డివిజన్ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల నియోజకవర్గంలో భారీ మెజారిటీతో సూపర్ విక్టరీ సాధిస్తామని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీతో అదరగొట్టారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం నుండి రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి, నెహ్రు నగర్, గోపి నగర్, మస్జీద్ బండ మీదుగా శ్రీరామ్ నగర్ కాలనీతోపాటు డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమక్షంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అందరికి అభివాదం చేశారు. ఈ ర్యాలీలో శేరిలింగంపల్లి యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. జోరుగా ప్రారంభమైన బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ యువ నాయకులు ఉత్సాహంతో పాల్గొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ భారీ ర్యాలీతో శేరిలింగంపల్లి డివిజన్ మొత్తం గులాబి సైన్యంతో నిండిపోయిందని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పాలనలో చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు ఓటు వేసి మరొకమారు ఎంపి సీటు బీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌరవ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రధాన కార్యదర్శి, వార్డ్ మెంబర్లు, బస్తీ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, యువ నాయకులు, మహిళా నాయకురాళ్లు, బూత్ కమిటీ మెంబర్స్, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here