నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గం గ్రామంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ పాల్గొని కమలం గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని తెలిపారు. కార్యక్రమంలో శ్యామ్ లేట్ సంజీవ, గొర్రెన్క శ్రీశైలం, సతీష్ గౌడ్, చిత్తారి, రవిరాజ్, శ్రీకాంత్ వివిధ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది