ముదిరాజ్ సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి విరాళం

  • రూ. 3లక్షలు ప్రకటించిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ రాయదుర్గంలో ముదిరాజ్ సంఘ సంక్షేమ భవన నిర్మాణానికి తమ వంతు సహాయంగా 3 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ నేడు ముదిరాజుల అభివృద్ధి కోసం ఎంతో మేలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి నట్టేట ముంచిందని ఎద్దేవా చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజుల ఓట్లు దండుకొని వారికి ఇచ్చిన హామీని గాలికి వదిలేసిన ఘన చరిత్ర కెసిఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు . కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని తెలిపారు. కనీసం వారంతా ఒక దగ్గర కూర్చొని చర్చించుకోవడానికి కమ్యూనిటీ హాల్ లేకపోవడం గమనార్హం అన్నారు. రాబోయే రోజుల్లో ముదిరాజ్ సోదరులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, వారి అభివృద్ధికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి ముందు వరుసలో ఉంటామని రవి కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు
కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ముదిరాజ్ సంఘానికి ఆర్థిక సహాయమే కాకుండా వారు సూచించిన అభివృద్ధి పనులు కూడా చేసి పెడతామని, భారతీయ జనతా పార్టీని బరపరచాలని వారికి సూచించారు. కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, కృష్ణ యాదవ్, నరేందర్, మహేశ్వరి వరలక్ష్మి, శ్యామ్, ఇందిర పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here