నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియూ అనుబంధం రాష్ట్ర మూడో మహాసభ విజయవంతం చేయాలని కోరుతూ చందానగర్ హుడా కాలనీ సబ్ స్టేషన్ వద్ద గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి సిఐటియు కార్యదర్శి కొంగర కృష్ణ మాట్లాడారు. రాష్ట్రం లో విద్యుత్ రంగంలో 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఇంజనీర్లు ఎంతోమంది కార్మికులు నిత్యం ప్రమాదానికి గురై చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కౌంలలో పనిచేస్తున్న వేలాదిమంది ఉద్యోగులు సమస్యలు చర్చించడం ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక సుదీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న ఆపరేషన్, మెయింటెనెన్స్, ఆర్టిజన్లు, పీస్ రేట్, లైన్మెన్ , హౌస్ కీపింగ్ తదితర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తీర్మానాలు చేయనున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్ ప్రాంతంలో 19 20 తేదీలో జరిగే ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకుడు రవీందర్, ఆంజనేయులు కార్మికులు బాలస్వామి, వెంకటేష్ నరేష్ చిన్న గోడపత్రిక ఆవిష్కరణలో పాల్గొన్నారు.