నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలోని సాయి వైభవ్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్కడ పర్యటించారు. కాలనిలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికంగా మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సరైన చర్యలు తీసుకోకపోవటం, శుభ్రం చేయకపోవటం వల్ల తరచూ అనారోగ్యాల పాలుకావాల్సి వస్తోందని కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకోని రావాలని ప్రజలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రంగస్వామీ ముదిరాజ్, సాయి వైభవ్ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.