శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయ అభివృద్ధికి విరాళం

  • రూ. 50 వేల చెక్కును విశ్వకర్మ సభ్యులకు అందజేసిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో విశ్వకర్మ సోదరులు దైవంగా భావించే శ్రీ గాయత్రీ విశ్వకర్మ దేవాలయ అభివృద్ధికి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ రూ. 50వేలు విరాళంగా అందించారు. నగదుకు సంభందించిన చెక్కును బిజెపి నాయకులు ఎల్లేష్ , రమేష్ సమక్షంలో విశ్వకర్మ సంఘం అభివృద్ధి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పాపిరెడ్డి కాలనీలో అయ్యప్ప స్వాముల కోసం ఒక సన్నిధానం ఏర్పాటు చేయాలని అయ్యప్ప స్వాములు తన దృష్టికి తెచ్చారని అన్నారు. అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతామని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు శేషగిరిరావు, సుబ్రహ్మణ్య చారి, శ్రీనివాస చారి, శంకరాచారి, కోటి, సత్యం పాల్గొన్నారు.

విశ్వకర్మ సంఘం అభివృద్ధి సభ్యులకు చెక్కును అందజేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here