కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గుల్షన్ నగర్ లో రూ. 32లక్షల అంచనా వ్యయంతో, అంజయ్య నగర్ లో రూ. 22 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్ల పనులను కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ మంగళవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పాలనలో, మంత్రి కేటీఆర్ విజన్ తో, ప్రభుత్వ విప్ గాంధీ కృషితో కొండాపూర్ డివిజన్ లో ఎన్నో అభివృద్ధి పనులను చేసుకుంటున్నామన్నారు. మౌలిక వసతులు కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ డివిజన్ లో మంచి నీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్ల పనులను యుద్ధ ప్రాదిపదికన చేయిస్తున్నట్టు తెలియజేశారు. దృష్టికి తీసుకువచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు. ప్రజలు, వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రోడ్ల పనులను చెయ్యాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ నరసింహ సాగర్, ఏరియా కమిటీ మెంబర్ కరీం, రవి శంకర్ నాయక్, పద్మశ్రీ, జుబేర్, రహీమ్, హినాయత్, స్వామి, సాబేర్ హుస్సేన్, ఖమరుద్దీన్, ఎల్. అనిల్ సింగ్, ఇంతియాజ్ అహ్మద్, షేక్ అస్లాం, నరేష్, వలియుద్దీన్, శ్రవణ్, షహవాజ్ హుస్సేనీ, షేక్ నయీమ్, బడరుద్దీన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.