విఘ్నేశ్వరుడికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగపల్లి : విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా నియోజకవర్గంలో మియాపూర్ గ్రామంలో కొలువుతీరిన గణనాథులు ప్రత్యేక పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లోని వినాయకులను బీజేపీ రాష్ర్ట నాయకుడు రవికుమార్ యాదవ్ దర్శించుకున్నారు.

అనంతరం ప్రత్యేక పూజలు చేపట్టి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు వడ్డించారు. ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here