- వరద నీటి కాల్వ, బాక్స్ కల్వర్ట్ నిర్మాణ పనుల పరిశీలన
నమస్తే శేరిలింగపల్లి : వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల అంచనావ్యయం తో చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ , వరద నీటి కాల్వ నిర్మాణం పనులను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. బాక్స్ కల్వర్ట్ , వరద నీటి కాల్వ నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలని, పనులలో వేగవంతం పెంచాలని, అలసత్వం ప్రదర్శించకూడదని అధికారులకు ఆదేశించారు.
వర్షం పడుతున్న ప్రతిసారి లింగంపల్లి అండర్ బ్రిడ్జి నీటితో నిండి పోవడం వల్ల పరిసర ప్రాంత ప్రజలకు, వాహన దారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఈ సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారం దిశగా వరద నీటి కాల్వ, బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఈఈ శ్రీకాంతిని, డీఈ దుర్గ ప్రసాద్, ఏఈ సునీల్, ఏఈ సంతోశ్ రెడ్డి , టౌన్ ప్లానింగ్ ఏసీపీ మెహ్రా , టీపీఎస్ రవీందర్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘనాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, పొడుగు రాంబాబు , కృష్ణ యాదవ్, నటరాజు, లింగం శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, రమణయ్య, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి, అవినాష్, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.