నమస్తే శేరిలింగపల్లి : విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా గణనాథులు ప్రత్యేక పూజలందుకుంటున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ డివిజన్ లోని వినాయక మండపాలలో గణేశుడిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జెరిపేటి జైపాల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ సురేష్ నాయక్, ప్రేమ కుమార్ యాదవ్, చంద్రయ్య, ముఖ్య కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.