నమస్తే శేరిలింగంపల్లి: మదినగూడ లోని విజయ ఆసుపత్రిలో ఓ వృద్ధుడికి అరుదైన కంటి శస్త్ర చికిత్స ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రిలోని డాక్టర్ రామ్ కంటి విభాగంలో కరీంనగర్ కు చెందిన కాజా తహరుద్దీన్ కు అరుదుగా నిర్వహించే కార్నియా మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసి కంటిచూపును మెరుగుపరిచారు. ఈ సందర్భంగా వైద్యులు డా.సాహిత్య, డా.ఫణి కుమార్ లు మాట్లాడుతూ ఎల్.వి.ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుండి కార్నియాను సేకరించి బాధితుడికి కార్నియల్ రీప్లేస్మెంట్ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో విజయ హాస్పిటల్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులను నేత్రదాన సంచాలక అల్లం పాండురంగారావు అభినందించారు.






