నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని అన్ని కాలనీలు, బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని నేతాజీనగర్ వాసులు కార్పొరేటర్ కార్యాలయంలో గంగాధరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న పలు సమస్యలను కార్పొరేటర్ కు వివరించారు. కాలనీ సమస్యలను పరిష్కరించి అభివృద్దికి కృషి చేస్తానని గంగాధరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.






