విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నదే బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం

  • ట్రస్ట్ ఛైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి వెల్లడి

నమస్తే శేరిలింగంపల్లి : విద్యార్థి దశలో విద్యాభ్యాసం కోసం తాము అనేక కష్టాలను అనుభవించామని, ఆ పరిస్థితులు నేటి విద్యార్థులకు ఉండకూడదనే ఉద్దేశ్యంతో.. ప్రతి విద్యా సంవత్సరంలోనూ పూర్తిస్థాయిలో విద్యాసామాగ్రిని దుస్తులను విద్యార్థులకు అందిస్తున్నట్లు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి వెల్లడించారు.

లక్నవరం పంచాయతీ దుంపల్లెగూడెం గ్రామంలో విద్యార్థులకు విద్యాసామాగ్రితో పాటు దుస్తులు పంపిణీ చేస్తున్న, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి , బొబ్బ నవతారెడ్డి

లక్నవరం పంచాయతీ దుంపల్లెగూడెం గ్రామంలో ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు లక్ష యాభై వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్లు, కంపాస్ బాక్సులు, డ్రెస్సులు, షూస్ సాక్స్, టైతో సహా విద్యార్థులకు అవసరమైన పూర్తిస్థాయి సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ విజయ్ రెడ్డి మాట్లాడారు.

విద్యార్థి, విద్యార్థినులు, ఉపాధ్యాయులతో బొబ్బ నవతారెడ్డి

గత 15 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు పూర్తిస్థాయిలో విద్యాసామాగ్రి, దుస్తులు అందిస్తున్న ట్లు తెలిపారు. గతంలో పాఠశాలకు క్రీడా సామాగ్రితో పాటు గ్రామానికి తాగునీటి సౌకర్యం కోసం మినరల్ వాటర్ ప్లాంట్, దేవాలయాల అభివృద్ధికి హీతోదికంగా ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు.

సామాజిక సేవ కోసమే ట్రస్టు నిర్వహిస్తున్నాం: చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి

హైదరాబాద్ తోపాటు తమ తండ్రి విజయ్ రెడ్డి పుట్టి పెరిగిన దుంపెల్లి గూడెం గ్రామంతోపాటు పలు గ్రామాలలో బొబ్బ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి తెలిపారు. విద్యార్థులకు విద్యాసామాగ్రి, దుస్తులు, గ్రామస్తులకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు తమకు ఇచ్చిన సంపదలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగించడం సంతృప్తినిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. తిరుపతయ్య ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీరాములు, కార్యదర్శి సాంబమూర్తి, గ్రామస్తులు కట్ల జనార్దన్ రెడ్డి, సామ చిట్టిబాబు, భూక్యా రాజు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here