నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపన్ పల్లి గ్రామంలో రూ. 30 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను, రాజీవ్ నగర్ లో రూ.15 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీ వాసులతో కలిసి గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను, భుగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, శ్రీనివాస్, ప్రభాకర్, మురగ, మన్నేరమేష్, రంగస్వామి, చిన్న శ్రీకాంత్, వర్క్ ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్, మల్లేష్, గోపన్ పల్లి, రాజీవ్ నగర్ కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.