నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచంలో ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేనిది చదువు ఒక్కటేనని విద్యార్థిని, విద్యార్థులకు హితబోధ చేశారు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ రవి కుమార్ యాదవ్. హైదర్ నగర్, వెంకటేశ్వర నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు 15000 వేల పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజుల్లో ఒక మనిషి బతకడానికి నిత్యావసర వస్తువులు ఎంత ముఖ్యమో విద్య అంతే ముఖ్యమని తెలిపారు.
ప్రపంచంలో పేరు పొందిన ప్రముఖులంతా ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలనే చదువుకొని దేశానికి ఎంతో సేవ చేసి ప్రపంచ చిత్రపటాలలో నిలిచారని కొనియాడుతూ మీరంతా కూడా మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. తమ ట్రస్టు సేవలు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ గౌడ్, నర్సింగ్ రావు, శేషయ్య, రామ్ రెడ్డి, చారి, సీతారామరాజు, అరుణ్ కుమార్, వేణుగోపాల్ యాదవ్, గోపాల్ రావు, రాజారెడ్డి, సునీల్ రెడ్డి, శ్రీనివాస్, భూషణం, లక్ష్మారెడ్డి, బాలు యాదవ్, శ్రీధర్ పటేల్, రేపాన్ రాజు, తిమ్మయ్య, ముత్యాలు, కళ్యాణ్, కృష్ణా, వీరు యాదవ్, బాలాజీ, విజయ్, నరేష్, బంటి, నర్సింగ్, బాలయ్య, బాలాజీ, సైదమ్మ, రేణుక పాల్గొన్నారు.