ఈఈ, డీఏఓ లపై చర్యలు తీసుకోవాలి

  • విధులు నిర్వహిస్తున్నా వేధిస్తున్నారు
  • అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు
  • డిప్యూటీ కమీషనర్ కి వినతి పత్రం సమర్పించిన ఇరిగేషన్ సెక్షన్ (బోర్ వెల్) కార్మికులు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు, అధికారులకు వారధిగా పనిచేస్తున్నా వారికి వేధింపులు తప్పడం లేదు. పనికి తగ్గ గౌరవం లభించక ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు వేసిన అన్ని సెక్షన్లలో విధులు నిర్వహించినా చిన్న చూపు చూస్తూ.. కించపరుస్తున్నారని, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇది వెస్ట్ జోన్ పరిధి చందానగర్ సర్కిల్-21లో ఇంజినీరింగ్ బోర్ వెల్ సెక్షన్ లో విధులు నిర్వహించే కార్మికుల పరిస్థితి.

గురువారం వారంతా వెస్ట్ జోన్ పరిధి చందానగర్ సర్కిల్-21 డిప్యూటీ కమీషనర్ కి వినతి పత్రం సమర్పించారు. కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఈఈ, డీఏఓ లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారు ఎన్ని రకాలుగా డ్యూటీలు (ఎమర్జెన్సీ, మాన్సూన్, తదితర పనులు ) వేసినా చేస్తున్నామని, కానీ ఏమి చేయడం లేదంటూ వేధిస్తున్నారని, తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. వారిలో బి. రఘు, ఎస్.కె. జుబైర్, హనుమంతు, ఏ. నర్సింహా రెడ్డి, ఎం. శ్రీను, దశరథ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here