నమస్తే శేరిలింగంపల్లి: నులిపురుగులను అరికట్టడానికి 1 నుంచి 19 ఏండ్ల లోపు వారు ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ నీలిమా అన్నారు. మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో జాతీయ నులిపురుగుల నిర్వహణ దినోత్సవం పురస్కరించుకొని నడిగడ్డ తాండలో బస్తీ దవాఖానలో మెడికల్ ఆఫీసర్ నీలిమాతో ఆశవర్కర్ ఇ. వనిత పిల్లలను సమీకరించి ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మాత్రలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులి పురుగు వల్ల వలన పిల్లలకు రక్తహీనత సరైన ఎదుగుదల ఉండదని, వీటిని నియంత్రించి ఆరోగ్య సమాజ నిర్మాణానికి పునాది వేయాలని అన్నారు. ఆల్బo డోజల్ మాత్రల వల్ల ఎటువంటి హాని ఉండదని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలని ప్రజలను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ ఈ వనిత, దేవనూరి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.