- మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం
- డివిజన్లలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యల పై చర్చ
- శిథిలావస్థకు చేరిన విద్యుత్ పోల్స్ స్థానంలో నూతన స్తంభాలు
- బస్తిలలో అవసరం ఉన్న చోట్ల త్రీఫేస్ కన్వర్షన్ తీగల ఏర్పాటు..
- ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లను తొలగించాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్లలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యల పై చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల పై రోజు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. టిఎస్ఎస్ పిడిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఈ వెంకన్న, సిజిఎం ఆనంద్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి , మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావు, విద్యుత్ అధికారులు, స్ట్రీట్ లైట్స్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ఎన్నో కొత్త కరెంట్ స్తంభాలు, సబ్ స్టేషన్ల ను నిర్మాణం, ట్రాన్స్ ఫార్మర్లను అమర్చామని తెలిపారు. వివిధ ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన పోల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని, బస్తిలలో అవసరం ఉన్న చోట్ల త్రీఫేస్ కన్వర్షన్ తీగలను ఏర్పాటు చేయాలని, కొన్నిచోట్ల ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్ వైర్లను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రమాదకరంగా రోడ్డు పై ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను తీసి వేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా సర్వే నంబర్ . 77 , 78 , 79 , 80, గోకుల్ ప్లాట్స్, ప్రేమ్ నగర్, మార్తాండ్ నగర్, హఫీజ్ పేట్ ప్రాంతాలలో నివాసాలకు విద్యుత్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాట్లుతో విధ్యుత్ సమస్య తీరిందని తెలిపారు. అదేవిధంగా గోకుల్ ప్లాట్స్ లో GHMC అనుమతి కూడా ఇస్తున్నట్లు చెప్పారు. టిఎస్ఎస్ పిడిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విప్ గాంధీ తెలిపిన విషయాలను పరిగణలోకి తీసుకొని వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజావసరాల దృష్ట్యా అవసరమున్న చోట అదనంగా మరిన్ని సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతామని, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు తెలియజేసిన సమాచారాన్ని DE , AD , AE లు ప్రత్యేక్షంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక అందజేసి సమస్యలు పరిష్కరించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా, సాంకేతిక కారణాలు లేకుండా చూడాలని, విద్యుత్ అంతరాయం జరిగితే క్షేత్ర స్థాయి లో పనిచేస్తున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తప్పవని, ప్రజానీకానికి మెరుగైన విద్యుత్ సరఫరా చూడాలని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ అధికారులు DE గోపాల్ కృష్ణ, DE రాజు, DE చక్రవర్తి, ADE లు రాము, ప్రసాద్, మల్లేష్, శ్యామ్ ప్రకాష్ , AEలు రాజ్ కుమార్, ఆంజనేయులు, శ్రీనివాస్, హరిసింగ్, చైతన్య, సత్యవాణి, రాజ్ కుమార్, S. K షాబాజ్, స్ట్రీట్ లైట్స్ EE మల్లిఖార్జున్, DE సునీల్ కుమార్, DE స్వప్న రెడ్డి ,AE రామ్మోహన్, AE రాజశేఖర్, AE మృదుల రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శ్రీకాంత్, శీనయ్య, శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, ఆయా డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షులు వాలా హరీష్ రావు, గంగాధర్ రావు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆదర్శ్ రెడ్డి, పోతుల రాజేందర్, చంద్రిక ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు.