- విద్యుత్ శాఖ అధికారులతో ఎలక్ట్రికల్ సమస్యలపై శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమీక్ష సమావేశం
- సమస్యలను పరిష్కరించాలని ఆదేశం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని వెంటనే తొలగించాలని ఎలక్ట్రికల్ డీఈ, ఏఈ గార్లకు ఆదేశించారు. గోపి నగర్, నెహ్రూనగర్, ఆదర్శ్ నగర్, ప్రశాంతి నగర్, బాపు నగర్ తదితర కాలనీలలో, బస్తిల్లో శిథిలావస్థకు చేరుకున్న కరెంటు పోల్స్ ను తొలగించి వాటి స్థానంలో నూతన కరెంట్ పోల్స్ ను ఏర్పాటు చేయాలని, కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఇంటిపై నుండి వెళ్లిన విద్యుత్ వైర్లను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని, ప్రమాదకరంగా రోడ్డు పై ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తీసి కొత్తవి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కాలనీలలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డీఈ గోపాల్ కృష్ణ, ఏడీ రాంబాబు, ఏఈ వెంకట నారాయణ రెడ్డి, సబ్ ఇంజనీర్ కిషోర్, లైన్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, డివిజన్ గౌరవ అధ్య క్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపినగర్ బస్తీ ప్రెసిడెంట్ గోపాల్ యాదవ్, ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, లక్ష్మి నాయుడు, దాసోజు శ్రీనివాస్, నెహ్రు నగర్ బస్తీ ప్రెసిడెంట్ గఫర్, సత్యనారాయణ, పిల్లి యాదగిరి, అశోక్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, ప్రభాకర్, మూర్తి, సురేష్ పాల్గొన్నారు.