నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో కొనసాగుతున్న వేసవి శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ ఆర్ట్ క్యాంపు లో పెద్దలు పిల్లలు కలిపి 85 మంది మట్టి కుండల తయారీ, అక్రిలిక్ పెయింటింగ్, మధుబని పెయింటింగ్, నిర్మల్ పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్ పెన్సిల్ స్కెచ్, చెరియల్ పెయింటింగ్ , క్లే టోయ్స్, భగవత్గీత శ్లోకాలు, సంస్కృతం అంశాలలో శిక్షణ తీసుకున్నారు. వారు నేర్చుకొని గీసిన పెయింటింగ్స్ మట్టి కుండలు అన్ని ప్రదర్శన కి పెట్టారు, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఇంజనీర్ అంజిరెడ్డి ప్రదర్శనను తిలకించి పాల్గొన్న వారందరికీ ప్రశంస పత్రాలు ఇచ్చి సత్కరించారు.

