రాబోయే రోజుల్లో మినీ హైదరాబాద్ గా చేవెళ్ల..

  • 111 జీఓ ఎత్తివేత హర్షణీయం
  • సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్ కు ధన్యవాదాలు
  • జీఓ ఎత్తివేత పై అవగాహన రాహిత్య, అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దు
  • చేవెళ్ళ ఎంపీ డాక్టర్.జి. రంజిత్ రెడ్డి
బిఆర్ ఎస్ శ్రేణులతో కలిసి సంబరాలలో నిమగ్నమైన చేవెళ్ళ ఎంపీ డాక్టర్.జి. రంజిత్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: మూడు దశాబ్దాలుగా చేవెళ్ల అబివృద్దికి గుది బండ లా ఉన్నా111 జీఓ ఎత్తి వేయడం హర్షణీయమని, సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ జి రంజిత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కేటిఆర్ ప్రత్యేక చొరవతో రాబోయే రోజుల్లో మినీ హైదరాబాద్ గా చేవెళ్ల ఆవిర్భవించనుందన్నారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో 111 జీఓ ఎత్తి వేయడంతో శుక్రవారం మొయినాబాద్ లోని చౌరస్తాలో బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం మొయినాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య తో కలిసి మాట్లాడారు.

మిఠాయిలు తినిపిస్తూ..

మూడు దశాబ్దాల పాటు చేవెళ్ల ప్రాంత వాసులకు గుది బండగా ఉన్న 111 జీఓ ఎత్తి వెయ్యడం తో సీఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, రాష్ట్ర మంత్రి మండలికి ధన్యవాదాలు తెలిపారు. నాడు పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, ఎంపీగా రంజిత్ రెడ్డిని గెలిపిస్తే 111 జీఓ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ, నేడు ఆయన ఇచ్చిన మాట ప్రకారమే జీఓ ఎత్తి వేసారన్నారు. జీఓ ఎత్తి వెయ్యడం తో ఈ ప్రాంత వాసులు సంతోషంతో మునిగి తేలుతున్నారన్నారు. ఈ ఎత్తివేత తో ఎచ్ ఎండిఎ పరిధిలో ఏవైతే విధి విధానాలు అమలు అవుతున్నాయో అవే విధానాలు ఇక్కడ అమలు అవుతాయన్నారు. ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మూసి నదిని క్లీన్ చెయ్యడానికి కావాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని వివరించారు. 111 జీఓ ఎత్తివేతతో హైదరాబాద్ నగర అభివృద్ధి ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచే దాదాపు ఒక లక్ష ఎకరాల మేర చేవెళ్ల అభివృద్ధి చెందనుందన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాబోయే రోజుల్లో చేవెళ్ల మినీ హైదరాబాద్ గా అవతరించనుందనీ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here