- పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే గాంధీ… అన్నప్రసాదాల వడ్డింపు
నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ శుభసందర్బంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన కాలనీ లోని శ్రీ రామాలయం దేవస్థానంలో అత్యంత వైభవంగా పుజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయుల సుందర స్వప్నం అయోధ్య శ్రీ రామ మందిర భవ్యక్షేత్రం ప్రారంభోత్సవం శుభసందర్బంగా అయోధ్య రామ మందిరంలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవ శుభసందర్బంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నా అని చెప్పారు. ఎన్నో ఏండ్ల కళ నెరవేరిన శుభతరుణం అని, ఆ శ్రీ రాముని కృపా కటాక్షాలు ప్రజలందరి పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ వెంకటేష్ , రాజశేఖర్ రెడ్డి, నరేందర్ బల్లా, ఆలయ కమిటీ ప్రతినిధులు రవీందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నాగిరెడ్డి, సురేందర్ రెడ్డి కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.