అన్నమయ్యపురంలో రామ స్మరణం

నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య బాలరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అన్నమయ్యపురంలో మామిడాకులు, అరటి పందిరిలో అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సమక్షంలో శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ హనుమ విగ్రహ పూజ అంగరంగ వైభవంగా రామ సంకీర్తనలను భక్తిపూర్వకంగా ఆలపించి అలరించారు.

శ్రీ రామ సంకీర్తనలను ఆలపిస్తూ

ఇందులో భాగంగా పద్మశ్రీ శోభారాజు రామభద్ర రారా, వారి శిష్య బృందం వసంతి వాల్మీకి కోకిల అనే పాట పాడగా, జయశ్రీ అపుడేమనే ఎమనుమనెనో అనే అన్నమయ్య సంకీర్తన, జనని భవిష్య రామ నామ సంకీర్తనతో అలరించింది. ఈ కార్యక్రమానికి పద్మశ్రీ శోభారాజు శిష్యుడు కళ్యాణ్ తబలా మీద వాయిద్య సహకారం అందించారు.

ప్రత్యేక పూజల్లో…

అనంతరం శ్రీ సీతా సమేత రామ లక్ష్మణ హనుమ స్వాములకి దివ్య హారతులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. నందకుమార్ అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here