సాయి బృందావన్ కాలనీలో 41 రోజులపాటు అఖండ దీపం

నమస్తే శేరిలింగంపల్లి : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా 12.50 నిమిషాలకు దివ్యమైన బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. మోడీతో పాటు సిఎం యోగి, 14 జంటలు, 4 వేల మంది సాధువులు పాల్గొన్నారు.

సాయి బృందావన్ కాలనీలోని శివాలయంలో అఖండ దీపం వెలిగించిన అనంతరం కాలనీ వాసులతో రాఘవేందర్ రావు ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్ సెక్రెటరీ తదితరులు
  • 41 రోజులపాటు అఖండ దీపం..

అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం భాగంగా సాయి బృందావన్ కాలనీలోని శివాలయంలో కాలనీ వాసులందరూ పూజల అనంతరం అఖండ దీపం వెలిగించారు. 41 రోజులపాటు కాలనీవాసులు నూనె పోసి వెలిగించనున్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రావు ప్రెసిడెంట్ ప్రణయ్ కుమార్ సెక్రెటరీ రవి, సురేష్, విజయ్, చారి, అభిషేక్, వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here