నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి బ్రదర్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుక ఆనందోత్సహాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. అందేలా బ్రదర్స్ కుమార్ యాదవ్, కిరణ్ యాదవ్, కిషోర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వర్షాకాలపు చల్లని వాతావరణంలో యువజన సంఘం సభ్యులు, అభిమానులు మిత్రమండలి కుటుంబ సభ్యుల మధ్య కిషోర్ కుమార్ యాదవ్ కేక్ కట్ చేశారు.
అనంతరం యువజనుల కేరింతలు మిన్నంటాయి. డాన్సులు, పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంతోషంగా వేడుక జరిపారు. ఇందులోభాగంగా నూరేళ్లు చల్లగా హాయిగా బతకాలని తన కుమారుడు కిషోర్ కుమార్ యాదవ్ ని అతడి అమ్మ లలితమ్మ ఆశీర్వదించి దీవించారు. కార్యక్రమంలో శీను, మనోజ్ కిరణ్ యాదవ్, కిషోర్ యాదవ్, యువజన సంఘం కార్యవర్గం సభ్యులు అభిమానులు గఫర్, రవి యాదవ్, మిత్ర బృందం రవి యాదవ్, జావిద్, విజయ్, శ్రీను, యాదయ్య, మధు యాదవ్, పవన్, అజయ్, మిగతా సభ్యులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.