కనులపండువగా శ్రీ సాయి బాబా దేవాలయం 14వ వార్షికోత్సవం

  • ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధి నేతాజీ నగర్ కాలనీలోని శ్రీ సాయి బాబా దేవాలయం 14వ వార్షికోత్సవం కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆశీస్సులతో శ్రీ రుద్ర సహిత చండి యాగం నిర్వహించారు.

నేతాజీ నగర్ కాలనీలోని శ్రీ సాయి బాబా దేవాలయం ప్రత్యేక పూజలు చేసి హారతి తీసుకుంటున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

అదేవిధంగా బాబా సేవలో జోషి రాఘవేంద్ర శర్మ (పంతులు) 25 సంవత్సరాలు(సిల్వర్ జూబ్లీ) సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా జోషి రాఘవేంద్ర శర్మకి స్వర్ణ కంకణ ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు శ్రీకరం శుభకారం తేజస్వి శర్మ, హిమాలయ తపస్వి సిద్ద యోగి, రాఘవేంద్ర శర్మ పంతులు, రవీందర్ రావు, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్, తిరుమలేష్, గోపాల్ యాదవ్, రాజు, మహేష్, రంజిత్, రవి కిరణ్, ఎంగయ్య గౌడ్, నగేష్, నారాయణ, మల్లికార్జున, దివ్య, కుమారి భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here