- పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్, రామచందర్ రాజు
నమస్తే శేరిలింగంపల్లి: బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. బోనమెత్తిన ఆడపడుచులు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో నగరమంతా ఆధ్యాత్మిక శోభ వెళ్లివిరుస్తున్నది. ఇందులో భాగంగా హాఫిజ్ పేట్ డివిజన్ హుడా కాలనీలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా హాఫిజ్ పేట్ డివిజన్ నుంచి రేణుక, రాజేష్ గౌడ్..గచ్చిబౌలి డివిజన్ నుంచి సందీప్ రెడ్డి పిలుపు మేరకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్, జెరిపెట్టి రామచందర్ రాజులు ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ప్రజలను చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, రాజేందర్, మహమ్మద్ జాంగిర్, కాటా నరసింహ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్, సూర్య రాథోడ్, సునీల్ గౌడ్, పీటర్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు.