‘హోప్’ సేవలు అభినందనీయం

  • నిత్యం అన్నదాన కార్యక్రమాలు
  • నిరుపేదలకు అండగా నిలుస్తూ.. ఆర్థిక సాయం
  • శనివారం ఇద్దరు ఇంటర్ విద్యార్థినులకు రూ. 30 వేలు అందజేత
  • ముఖ్య అతిథులుగా హాజరైన బీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్
  • హోప్ ఫౌండేషన్ సేవలపై ప్రశంస

అన్నదానం..ఒక మహాదానంగా ఆచరిస్తున్నది ఆ సంస్థ..ఆపదలో ఉన్నవారికి చేయుతనిస్తూ.. ఆర్థిక స్తొమత వల్ల చదువుకోలేకపోతున్న వారికి తాను ఉన్నానంటూ అండగా నిలబడుతున్నది.. ఇలా గత కొన్నెండ్లుగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నది హోప్ ఫౌండేషన్..తాజాగా ఇద్దరు ఇంటర్ విద్యార్థినులకు ఆర్థిక అందజేశారు ఆ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, అంతేకాక ఆ ఫౌండేషన్ చేపట్టిన అన్నదాన కార్యక్రమం శనివారానికి 37వ వారానికి చేరుకున్నది.


నమస్తే శేరిలింగంపల్లి


హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ గత కొంత కాలంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ శనివారానికి 37వ వారానికి చేరుకుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ లు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో పాటు శనివారం ఇద్దరు ఇంటర్ విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించారు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్.

చందానగర్ శాంతినగర్ కు చెందిన డి.రాజు (వికలాంగుడు). ఇతనికి ఇద్దరు కవల కూతుర్లు ( సాయిరేఖ, సంగీత) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరి చదువుల కోసం రూ. 30 వేల ఆర్థిక సహాయం అందజేయగా.. ఈ ఆర్థిక సహాయం చెక్కును కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బీఆర్ ఎస్ నేత బండి రమేష్ వారికి అందజేశారు. హోప్ ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, గంగారాం సంగారెడ్డి, కాకర్ల అరుణ, కనకమామిడి నరేందర్ గౌడ్, పద్మారావు, దేవేందర్ రావు, బాలరాజు, హోఫ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here