- ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం
- శుభాకాంక్షలు తెలిపిన ముఖ్య అతిథులు
నమస్తే శేరిలింగంపల్లి: కెపిహెచ్ బిలోని మంజీరా ట్రినిటీ హాల్ లో డిస్ట్రిక్ట్ వి105 ఏ, రోజన్ 3 పరిధిలో 3 జోన్లలోని 10 క్లబ్బులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మెగా ఇన్స్టాలేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్య వర్గం (నూతన అధ్యక్షులు, కార్యదర్శలు, కోశాధికారులు) ప్రమాణ స్వీకారం చేశారు. 200లకు పైగా వాసవియన్లు పాల్గొని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్స్ V105A గవర్నర్ వాసవియన్ విద్య సంకల్ప మానేపల్లి రామారావు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ విఎన్ గోల్డెన్ కేసిజి ఎఫ్ మాశెట్టి ఉపేందర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్ వియన్ గోల్డెన్ కేసిజీ ఎఫ్ బెజుగం రాజేశ్వరి, శేరిలింగంపల్లి కాంటెస్టేడ్ ఎమ్మెల్యే గజ్జెల యోగానంద్, కేబినెట్ సెక్రెటరీ కే సురేందర్ కుమార్, కేబినెట్ ట్రెజరర్ ఆర్ రాజేశ్వర రావు, వైస్ గవర్నర్ బానూరి నర్సింహులు, డిస్ట్రిక్ట్ ఇంఛార్జి పి. శ్రీనివాసరావు, రీజిన్ చైర్ పర్సన్ కే అనురాధ లక్ష్మీ, జోన్ చైర్ పర్సన్లు కే. గోపాలకృష్ణ, జి. శ్రీవాణి సుకన్య, ఎ. భాగ్యలక్ష్మి రీజిన్ సెక్రటరీ బి రాధిక పాల్గొన్నారు. గవర్నర్ మానేపల్లి రామారావు, ఇతర ప్రముఖులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వాసవి క్లబ్ ర్ చేపడుతున్న సేవా కార్యక్రమాల విషయాలు, పథకాలు గురించి వివరించారు. అంతేకాక పేద పిల్లలకు సహాయం అందించేందుకు రూ. 5వేల స్కాలర్ షిప్ ను అందించారు.