వంశీ విహారం

  • 59 బంతుల్లో 82 పరుగులతో విరుచుకుపడిన వంశీ మోహన్ రెడ్డి
  • వరుస హాఫ్ సెంచరీలతో జోరు 
  • 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన టీఎస్ సిఎస్
  • హోరాహోరీ మ్యాచ్ లో గెలిచిన విద్యుత్ సౌధ జట్టు
59 బంతుల్లో 82 పరుగులు చేసిన సి.వంశీ మోహన్ రెడ్డి, డి ఎస్ పి & తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీస్ క్రికెట్ ప్లేయర్

నమస్తే శేరిలింగంపల్లి: టి-20 ఫ్రెండ్‌షిప్ కప్ 2022-2023లో భాగంగా తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ (టీఎస్ సిఎస్) జట్టు, విద్యుత్ సౌధల మధ్య మ్యాచ్ పోటీ పోటీగా జరిగింది. వాటర్ వర్క్స్ అంబర్‌పేట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగిన మ్యాచ్‌లో (టీఎస్ సిఎస్) ఓటమి పాలైంది. (టీఎస్ సిఎస్) మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 లక్ష్యాన్ని విద్యుత్ సౌధ ముందుంచింది. 151 లక్ష్యంతో బరిలో దిగిన విద్యుత్ సౌధ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు టీఎస్‌సీఎస్‌ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సి.వంశీ మోహన్ రెడ్డి చెలరేగి పోయాడు. 59 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు బాదాడు. టీఎస్ సిఎస్ ఓటమి పాలైన వంశీ మోహన్ రెడ్డి చేసిన పరుగులు ప్రత్యర్థికి చెమటలు పట్టించాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here