మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు

  • అధ్యక్షురాలిగా భవాని ఏకగ్రీవం..కార్యవర్గం నియామకం
  • డబుల్ బెడ్ రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోండి : బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : అర్హత కల్గిన మహిళలు డబుల్ బెడ్ రూం ఇండ్లకు దరఖాస్తులు చేసుకోవాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ తెలిపారు. శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా భేరీ రామచంద్ర యాదవ్ పాల్గొని మహిళా సంఘానికి మద్దతు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ స్థలం లేని వారికి స్థలం కూడా ఇవ్వటానికి ప్రకటించిందని, ఇల్లు లేని వారు, అర్హత ఉన్నవారు, పేదలు డబల్ బెడ్ రూమ్ గురించి మీ సేవలో అప్లై చేసుకోవాలని మహిళలను కోరారు.

నూతనం ఏర్పాటైన మియాపూర్ ప్రశాంత్ నగర్ మహిళా సంఘంతో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ , బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న తదితరులు

డబుల్ బెడ్ రూమ్ విషయంలో జాగా లేని వాళ్లకు జాగలు ఇప్పించే విషయంలో తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ మాట్లాడుతూ మహిళలందరూ అర్హత ఉన్నవారు డబల్ బెడ్ రూమ్ కు అప్లై చేసుకోవాలని కోరారు. మండల ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని మెమొరండం సమర్పించడానికి సమాయత్తం కావాలని కోరారు. బీసీ యూత్ అధ్యక్షులు కుమార్ యాదవ్ తమ సందేశంలో పేదల కోసం ముందుండి సేవ చేస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ విషయమే కాకుండా పేద వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు అండగా ఉంటానని కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ఉపాధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్ మొదటగా స్వాగతం పలుకుతూ పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం తాము అండగా ఉంటామని బేరీ రామచందర్ యాదవ్, కుమార్ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్ పూర్తి మద్దతు తెలిపారు. శేరిలింగంపల్లి కార్యదర్శి రాజు, మియాపూర్ మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ కార్యదర్శి వెంకటమ్మ ప్రసంగిస్తూ ప్రశాంత్ నగర్ మహిళా సంఘం ఏర్పాటు చేసి పోరాటం చేద్దామని మండల్ కలెక్టర్ ఆఫీసులో కూడా మెమోరండం ఇద్దామని పేర్కొన్నారు. ప్రశాంత్ నగర్ మహిళా సంఘం అధ్యక్షురాలిగా భవానిని ఏకగ్రీవంగా నియమించారు. ఉపాధ్యక్షురాలిగా రుక్మిణిని, ప్రధాన కార్యదర్శిగా అరుణని, సంయుక్త కార్యదర్శిగా విజయలక్ష్మిని, కార్యదర్శులుగా కృష్ణవేణి, అనిత, ప్రసన్న, మౌనికలను ఎన్నుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here