- వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టే పరిసర ప్రాంతాల పరిశీలన
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్, మహోధాయ ఎనక్లేవ్ కాలనీలలో “వరద నీటి కాలువ” నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను కాలనీ వాసులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ముంపునకు గురైన కాలనీలను దృష్టిలో ఉంచుకుని వివిధ కాలనీ వాసులకు ఇబ్బందులు కలుగకూడదని వరద నీటి కాలువ, సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో మియాపూర్ డివిజన్ లోనీ ఏఎస్ రాజు నగర్ , మహోధాయ ఎనక్లేవ్ కాలనీలలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులు చేపట్టబోయే పరిసర ప్రాంతాలను కాలనీ వాసులతో కలసి పరిశీలించామని తెలిపారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ.. సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలు గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర కుమార్, చుక్కరావు, సతీష్, సూర్యనారాయణ రాజు, శశిధర్, బుపతి రాజు, పాల్గొన్నారు.