నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్, హనీఫ్ కాలనీలలో రూ. 45 లక్షలతో అంతర్గత డ్రైనేజీ పనులకు ప్రభుత్వ విప్ గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ జీఏం రాజశేఖర్, అధికారులు, స్థానిక సీనియర్ నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి, శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హామీద్ పటేల్ మాట్లాడుతూ..ప్రతి కాలనీ, బస్తీలలో దాదాపుగా మౌలిక వసతులు లేమి లేకుండా అభివృద్ధి పనులను చేపడుతున్నామని అన్నారు. దాదాపు కొండాపూర్ డివిజన్ లోనే 80 శాతం మౌలిక వసతుల పనులు పూర్తి చేశామని, మిగిలి ఉన్న పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోనికి తీసుకోని వస్తామన్నారు. వాటర్ బోర్డు, జీహెచ్ఏంసీ అధికారుల సమన్వయంతో, బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులను శరవేగంతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అధికారులు జీఏం రాజశేఖర్, మేనేజర్ సందీప్, ఇంచార్జి శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, రక్తపు జంగంగౌడ్, నీరుడి గణేష్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ చౌదరి, ఎర్రరాజు, అశోక్ సాగర్, రజనికాంత్, సయ్యద్ ఉస్మాన్, హిమమ్, రవి శంకర్ నాయక్, జాఫర్, సమద్, అహ్మద్, డా. సుదర్శన్, సంజీవ, ముక్తార్, షేక్ రఫీ, వసీమ్, అక్షయ్ అభి ఉన్నారు.